
సామాన్యుడి కేక నిశీధిన నిదురిస్తుంది.... కానీ వీరుడి నిశ్వాస శత్రువుని సైతం కలవర పెడుతుంది.... రాచరికపు మూర్ఖత్వాలను ఒక జమీందారీ సంస్థానం అనే చిన్న శిల మీద నుండి మొదలుపెట్టి రెండో ప్రపంచ యుద్ధం అనే ఒక మేరునగాన్ని తీసుకొని ఏకశిలానాగరాన్నే నిర్మించిన అద్భుతమైన శిల్పి క్రిష్ ... ఇది నిజంగానే కంచె .. మన ఆలోచనలకు కంచె... తోటివాడిని హెచ్చుతగ్గుల త్రాసులో తూకం వేసి మరీ మనలో కలుపుకోవాలా వద్దా అన్న ఆలోచనకు కంచె. నా మనవడు చదువుకుని వచ్చాడు అని సంబరపడుతున్న తాతకు రేపు ప్రొద్దున్న నాకు క్షవరం చేయమని ఆదేశించిన ఒక ధనికుడి సంకుచితత్వపు ధోరణికి అడ్డుకట్ట వేసుకోమని విస్మరించిన మానవత్వపు పునాదులను తవ్విన కంచె !!!
కథ లో నాయకుడు దూపాటి హరిబాబు అనే ఒక సామాన్యుడు.... స్వచ్ఛమైన నీటివంటి వాడు. అందరిలో మంచిని చూడగలిగే వాడు. పరదేశీ యువతిలో కూడా తల్లిని దర్శించే మహోన్నతుడు. అన్నిటినీ మించి నమ్మిన నీతికి ప్రాణాలనైనా లెక్కచేయనివాడు. సినిమాలో నచ్చిన విషయాలు... కులమనే విషయాన్ని సరళంగా చెప్పిన తీరు అమోఘం.. ముఖ్యంగా సాయిమాధవ్ గారి సంభాషణలు, ఛలోక్తులు అద్భుతం... సంగీతం సందర్భానికి నేపథ్యానికి తగ్గట్టుగా అతికాయి... కళ, కెమేరా విభాగాల పనితనం అతి రమణీయం. 24 విభాగాల వారూ ప్రాణం పెట్టి పని చేశారు.
ఇక మాట్లాడవలసిన అసలు వ్యక్తి... రాధాకృష్ణ గారు... కుల వివక్షత మీద మీరు విసిరిన కొరడా అనిపించింది. అవసరాల జర్మన్ యువతిని అడ్డగించడం నుండి తల్లీ అని సంబోధించేంత వరకూ నడిచిన దృశ్యం అద్భుతం... ఊరిలో కంచెలకూ, దేశాల మధ్య వైరానికీ తేడాలేదని చెప్పిన అంశం.. రేపటి తరాన్ని కులరహిత సమాజం వైపుగా, విద్వేషాలకు దూరంగా నడపాలన్న ఆలోచనను hope అనే పాప జీవితాన్ని చూపిస్తూ రాబోయే ముప్పుని కూడా చూపడం వర్ణణాతీతం అనిపించింది. యుద్ధ సన్నివేశాలు ... నాకు చాలా ఇష్టమైన దర్శకులు Martin Scorsese గారి Pianist చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకునేలా చేశాయి.... హరిబాబు సీత ప్రేమ సన్నివేశాలు రామాయణంలో స్వయంవరం గుర్తుకువస్తే పెళ్ళి రుక్మిణీ కళ్యాణాన్ని స్ఫురణకు తెచ్చింది... ముఖ్యంగా ముగించే ముందు మూడు విషయాలు... 1. భార్య గుర్తువచ్చినప్పుడు హరి ఉత్తరం రాస్తూ కథను ప్రేక్షకుడికి చెప్పిన తీరు ... 2. చివరిలో తన బావ salute చేసి స్నేహితుడు అనడం.. 3. కంచె పీకమని అమ్మమ్మ తో చెప్పించడం !!!
I would like to conclude by coining Director Krish as "Scorcese of the South" !!
No comments:
Post a Comment