Tuesday, February 8, 2011

పయనం

హైదరాబాద్
22 - 07 - 2010

తెల్లవారు ఝాము  ఐదు గంటలకు....
అందరూ ఊళ్లలో కోడికూత తో నిద్ర లేస్తారు అని మొదలుపెడతారు...కానీ మా ఊళ్ళో అందరికీకిలో మీటర్ల అవతల ఉన్న అపార్టుమెంటుల దగ్గరి నుండి వచ్చే మా గుడి పూజారి గారి సైకిల్ బెల్లు మోత తో మాకు తెల్లవారుతుంది.... మా ఊరి పేరు మురికివాడ...
అదేం పేరు అని అనిపిస్తోంది కదా... దానికొక చరిత్ర ఉంది...
మా ఊరు గోదారి జిల్లా లోనో...కృష్ణా...గుంటూరు...చిత్తూరు...పక్కనో..లేక లంక గ్రామాలలోనో లేదు...
హై-టెక్  సిటీ కి  సమీపం లో ఉంది... మా మురికివాడ..ఇది నిజం గా మురికివాడే..ఎలెక్షన్లు వస్తే   గాని ఇక్కడ మనుషులు ఉన్నారని నాయకులకు గానీ..అధికారులకు గానీ..తెలియకపోవడం కధ కు కొసమెరుపు...

నలభై ఇళ్ళు... రెండు వందల మంది జనాభా..మా వాడ అవతల కొండ..కొండ మీద కృష్ణుడి గుడి, ఇదే మా ఊరు..
పేరు కూడా సరిగ్గా లేని మా ఊరికి ఒక బస్సు..అందరికీ తెలిసినట్టు గా..మాకు కూడా మా ఊరి పేరు... "మురికివాడ"..
ఇంకా ఇక్కడ మనుషుల జీవితాలను చూస్తే.... కూలి పనులతో సగం మంది పొట్ట పోసుకుంటే ...మిగితా జనాలు...అడుక్కోవడమే వృత్తి గా...అది దేవుడిచ్చిన వరం గా భావించే మనస్తత్వం ఇక్కడి జనాలది...
పిల్లలకి కూడా భిక్షాటనే ఆస్తి గా ఇచ్చే పెద్దలున్న వాడ లో నేనొక్కన్నే విద్యార్ధి ని.... ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం..
మా అమ్మ పేరు పూర్ణమ్మ..నాన్న మణి...అమ్మ సంపాదించే నాలుగు రాళ్ల తోనే నా బతుకు గడుస్తోంది..మా నాన్న తాపీ మేస్త్రి గా పని చేసేవాడు..ఒక బిల్డింగు కడుతున్నప్పుడు ..ఇటుకలు మీద పది..తల పగిలి కన్నుమూసాడు...లేకుంటే  నా బతుకు ఇక్కడ మురికివాడ లో మగ్గిపోయేది కాదు....
చదివేది జీవితాన్ని బాగుచేస్కోవడానికి అయినా, సరదాలు ఎరగని బతుకు నాది...డబ్బా లోకి చద్దన్నం..లేటు గా వస్తే సర్ అనే మాటలూ, వెన్నంటి  ఉండి  ప్రోత్సహించే మిత్రులు కొందరుంటే...మిగితా వాళ్ళలో నా దరిద్రాన్ని చూసి పక్కకి తొలగి పోయే వైఖరి..ఇలాంటి జీవితం లో నాకు నచ్చిన విషయాలు రెండే రెండు...
1 . నేను జీవితం లో ఏదైనా సాధించగలనన్న నమ్మకం... ఆశ...
2 . ప్రొద్దున్నే ఏడున్నరకు బస్సు ఎక్కే ముందు jogging  నుండి వచ్చే ఒక అందమైన అమ్మాయి..

నా కసి పక్కన పెడితే, నా జీవితం లో నాకు నచ్చినదీ, నాకు ఆనందం ఇచ్చినదీ, నేను కాలేజీ కు చేసే "పయనం"..
నేను మొదటి సారి తనని చూసింది..జనవరి నెలలో... అది చలి కాలం..చెట్ల మీద నుండి ఆకులు సన్నగా రాలి రోడ్డు మీద పడుతున్న సమయం..ఉదయం ఏడున్నర గంటలు... నేను బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను..ప్రతీ రోజు లాగానే రోజు కూడా బస్సు ఇంకా రాలేదు..నా చుట్టూతా మంచుతో ...మునిసిపాలిటి వాళ్ళు ఊడవగా రేగిన దుమ్ము తో నిండి పోయి ఉంది.. జన సంచారం కూడా సరిగ్గా కనపడట్లేదు... మశక  లోంచి సన్నగా ఒక అడుగుల శబ్దం వినబడుతోంది..క్రమేపీ శబ్దం పెద్దదవ్తోంది.... నాకు చంద్రముఖి గుర్తుకొచ్చింది... ఒక్క సారి మళ్ళీ కళ్ళు నులుముకుని సరిగ్గా పరికించి చూసాను.. మంచులో నుండి ఒక అమ్మాయి మెల్లగా పరిగెత్తుకుంటూ  వస్తోంది..
చక్కని ముఖ వర్చస్సు..అంతకన్నా అందమైన ఆకారం..తెల్లని టీ షర్టు , నల్లని ట్రాక్ పాంటూ,తెల్ల రంగు బూట్లూ,
చేతిలో - పోడ్,చెవిలో ఇయర్ ఫోన్లు,పెట్టుకుని ఉంది...తను అలా నన్ను దాటుకుని వెళ్తుంటే రోజా పూల సువాసన నా ముక్కు పుటలను తాకింది..ఇంకాసేపు తను అలానే నా ముందు నిలబడి ఉంటే... హచ్ యాడ్ లో బొచ్చు కుక్క లాగా తన వెంటే వెల్లేవాన్నేమో...కానీ విధి ఏడిచావ్ లే అని వెక్కిరించినట్లు గా మోగిన బస్సు సైరెను... నా ఊహలన్నింటిని నాశనం చేసింది...బస్సు ఎక్కగానే అమ్మాయి మాయం అయిపాయింది...
నా మిగిలిన జీవితం అంతా అలా తనని ఏడున్నర గంటలకు వచ్చే బస్సు ఎక్కే ముందు చూసే వాణ్ణి.. కానీ రోజూ.. తనతో ధైర్యం చేసి గుడ్ మార్నింగ్ కుడా చెప్పేవాన్ని కాదు...ఎందుకంటే తను కూడా నన్ను చూసి మొహం విరిస్తే.. తను నాకు చులకన  అయిపోతుంది.. అలా నాకు ఇష్టం లేదు...అందు కోసం నేను రోజు తనతో మాట్లాడలేదు ...

ఇలా నా చదువయ్యే వరకు గడిపాను... తరవాత ఒక పేరున్న కంపనీ లో ఉద్యోగస్తున్ని అయ్యాను ... ఇక్కడి నుండి నా జీవితం అనుకోని మలపులు తిరిగింది.. అదే కంపనీ లో పని చేస్తూ నేను అమెరికా కి వెళ్లి  పై చదువులు చదువుకున్నాను ...అక్కడే స్థిరపడ్డాను...నెలకు లక్షలలో జీతం..కారు..బంగ్లా...మంచి చెడ్డ చెప్పే మా అమ్మ...
ఇలాగ ఐదేళ్ళు గడిచాక..మళ్లీ నా దేశం మీద గాలి మళ్ళింది...వెంటనే తిరుగు టపాలో నా దేశానికీ వచ్చేశా.. ఇక్కడి మట్టి మీద నిలబడి పీల్చిన తోలి శ్వాస బీడు భూమి మీద పడ్డ తోలి చినుకు లాగా నన్ను తాకి ఉద్వేగానికి లోను చేసింది...
నా గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళాను..జ్ఞ్యాపకాలను తరుముకుంటూ మళ్లీ వెళ్ళాను..
నా కాలేజీ, నాకు పాఠాలు  చెప్ప్పిన గురువులూ, నాతొ చనువున్న స్నేహితులూ, అందరిని కలిసాను.
కానీ సేద తీరడానికి నా మనస్సు అనుకోకుండానే నా వాడ దగరకు తీసుకుని వెళ్ళింది...నా పాక...నేను పడుక్కున్న  మడత మంచం...అన్నీ అలానే ఉన్నాయ్...దుమ్ము గొట్టి...అయినా ఆలోచించకుండా దాని దుమ్ము దులిపి దాని మీదే పడకేసాను...
ఎన్ని మారినా మా పూజారి గారి బెల్లు మోత మాత్రం మారలేదు..అదే ఐదింటికి నన్ను లేపేసింది...మళ్లీ ఎదావిధిగా ఏడున్నర గంటలకి బస్సు స్టాప్ కి వచ్చి నిలబడ్డాను..
అంతా అలానే ఉంది..ఏమి మార్పు లేదు... అమ్మాయి కూడా అదే టైం కి కనపడుతుందని ఆశించాను..కాని నా ఆశ ఫలించలేదు ...తను రావచ్చన్న ఆశ తో ప్రతీ నిమిషం భారం గా.. ఆత్రుత తో గడిపాను..ఎండ నెత్తికెక్కింది .. దాహం పెరిగింది.. ఓర్పు సన్న గిల్లింది...కానీ తను మాత్రం రాలేదు...
నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతీ కష్టాన్ని నేను గెలవ గలిగాను... నాకు దక్కిన మొట్ట  మొదటి సంతోషాన్ని మాత్రం దక్కించుకోలేక పోయాను...కానీ ఏది మన కోసం ఆగదు... బస్సు..కాలం.. అమ్మాయి..ఏది మన కోసం ఆగదు...
అందుకే నా ఆశ ని మనసు లోనే దాచుకుని.. ఎక్కడ ఉన్న తన సంతోషాన్ని కోరుకుంటూ...భారం గా నా    "పయనం" సాగించాను .....

సమాప్తమో ఆరంభామో తెలియని అయోమయం లో ముగిస్తున్నాను....

4 comments:

  1. very gud bro.........sadhana is also gud........

    ReplyDelete
  2. chala baundi annaya
    thanaki nachina 2 points
    and " కానీ ఏది మన కోసం ఆగదు...ఆ బస్సు..కాలం.. ఆ అమ్మాయి..ఏది మన కోసం ఆగదు.." lines awesome

    ReplyDelete
  3. very good bro... flow bagundi. oka manchi feel loki teesukellav...

    ReplyDelete
  4. jeevitham lo nachina vishayalalo rendodhi andhaminadhi......modhatidhi avsaraminadhi...

    Bassu....kaalam...ammai...edi aagadhu....nice

    ReplyDelete