కంటి నిండుగ నీరు నిండిన.. చూపుకు తావెక్కడిది ??
మది నిండుగ గతము నిండిన భవితకు చోటెక్కడిది ??
పీడ కలల భాష్పముల నడుమ చిక్కుకుంటి నేస్తమా....
అభయహస్తమిచ్చు చేయి ఇహమున తారసిల్లునా ....
రక్తములో ప్రతి అణువూ వెక్కిరించుచున్నదే
నాడులలో జీవముడిగి కంపింప చేయుచున్నది
నిసిరేయి కాంతి లోన చెకోరమును నేనా??
ఏ చక్రవాకమైనా నా అగ్నిని చల్లార్చునా??

No comments:
Post a Comment