మత్తు సోకిన నిసిమి మసకేసి నింగికి
కరిమబ్బు పట్టేను.. చిరుజల్లు కురిసేను..
చినుకు చినుకే మినుకుమని వరదలై పొంగేను
జర జరా పారుతూ సంద్రానికేగేను!!
పుడమి పైన పుట్టి...నింగికెగసిన నరుడు
అన్నింట గెలిచేను.. నేలనే మరిచేను
ప్రకృతి మాత ఒడితో జూదమ్ము ఆడేను
సిరులు ఎన్నో కూడి.. మూలమ్ము మరిచెను
కష్టానికి తట్టుకొని.. కన్నీళ్ళు దిగమింగి
ఓరకంట ఉరమగా..తల్లడిల్లిపోయెను..
ఏవిరా నీ సిరులు.. ఏదిరా నీ భూమి...
ఎచటరా నీ ధనము.. ఎవరురా నీవిపుడు?
జాబు వచ్చునంత వరకు ఏ జాము వీడను..
తల్లి గుండె కోత తెలుసుకో కొడుకా..
ఎప్పటికైనా నా ఒడే నీ పడక!!
కరిమబ్బు పట్టేను.. చిరుజల్లు కురిసేను..
చినుకు చినుకే మినుకుమని వరదలై పొంగేను
జర జరా పారుతూ సంద్రానికేగేను!!
పుడమి పైన పుట్టి...నింగికెగసిన నరుడు
అన్నింట గెలిచేను.. నేలనే మరిచేను
ప్రకృతి మాత ఒడితో జూదమ్ము ఆడేను
సిరులు ఎన్నో కూడి.. మూలమ్ము మరిచెను
కష్టానికి తట్టుకొని.. కన్నీళ్ళు దిగమింగి
ఓరకంట ఉరమగా..తల్లడిల్లిపోయెను..
ఏవిరా నీ సిరులు.. ఏదిరా నీ భూమి...
ఎచటరా నీ ధనము.. ఎవరురా నీవిపుడు?
జాబు వచ్చునంత వరకు ఏ జాము వీడను..
తల్లి గుండె కోత తెలుసుకో కొడుకా..
ఎప్పటికైనా నా ఒడే నీ పడక!!
ఏ రాలే పువ్వుల చివరాశనై చిగురించానో నేను….
ReplyDeleteఏ కన్నీటి కొలనులో ఓదార్పు పవనమై వచ్చానో నేను…
ఏ పోరాడి ఓడిన యోధుడి పొలి కేక ఊపిరులందుకున్నానో నేను….
ఏ నిస్పృహలోని ఆఖరి పోరాటపు త్యాగాల స్థన్యమందుకున్నానో నేను…
ఏ వెక్కిరింపుల మధ్య చిరు నవ్వు పులుముకున్నానో నేను….
ఏ ఆశలుడుగిన గ్రీష్మాన…చిగురాశనో నేను…
ఏ బహుదూరపు బాటలో … బుడి బుడి అదుగునో నేను…
ఏ ఓటమి ఘడియల చిక్కిన పట్టునో నేను…
ఏ వేటకందని రివ్వుమనే పరుగునో నేను…
ఏ కమ్మటి కలల శ్రీకారమో నేను…
ఏ రేపటి భవితకు నాంది నో నేను…
ఏ చిక్కటి చీకటి కి చరమాంకమో నేను…
ఏ వేకువ బాణానికి విల్లునో నేను….