హైదరాబాద్
21-07-2012
నాలుగేళ్ల క్రితం సంగతి ఇది.. మా నాన్న కాన్సెర్ వచ్చి గతించిన రోజుల్లో... అప్పటికి నా చదువింకా పూర్తవ్వలేదు.. ఉన్న ఒక్క ఆధారం పోయింది... అయిష్టం గానే బంధువుల సహాయం తో చదువు పూర్తీ చేసాను.. నిర్ద్రానంగా, కళావినీనంగా గడిచిన రోజులవి. మా నాన్నకు , నాకు కళలన్నా, కళాకారులన్నా అమితమైన గౌరవం. చిన్నతనం నుండీ ఎన్నోరకాలుగా ప్రోత్సహించేవారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాల వేటలో పడ్డాను. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అనుకూలం గా లేనందున బెంగుళూరు లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని బెంగుళూరు ఎక్ష్ప్రెస్స్ ఎక్కేసాను.
ఓం ప్రధమం అన్నట్టు గా మొదలైన్ది నా కష్టం. తెలియని ఊరు, నోరు తిరగని భాష, పరిచయంలేని మనుషులు. ఇందులో నాకున్న ఒక చిన్న అదృష్టం ఏమిటంటే ఎక్కువ శ్రమ లేకుండా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రోగ్రామర్ గా ఉద్యోగం దొరికింది . అయినా ఏం లాభం? ఎవ్వరికీ చెప్పుకుని ఆనందించలేను నన్ను నేనే అభినందిన్చుకోవాలి !
అలా సాగుతున్న నా ఒంటరి ప్రయాణం ఒక సాయంకాలం నాడు మలుపు తిరిగింది. రోడ్డు మీద నడుస్తూ, గ్న్యాపకాలను తరుముకుంటూ వెళ్లాను. దగ్గరలో ఒక నాట్యాలయం కనపడింది. బయటకు చూడడానికి ఒక సాదాసీదా కుటీరం లాగా ఉంది. కాని లోనకు వెళ్లి చూడగా నన్ను నేనే నమ్మలేకపోయాను. లోపల రెండు ఎకరాలలో అలాంటి కుటీరాలు 10-12 దాకా ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కక్క రంగు, ఒక్కొక్క కుటీరంలో ఒక్కొక్క నాట్యరీతిని నేర్పిస్తున్నారు. అలా కుటీరాలను దాటుకుంటూ వెళ్లాను. ఇప్పుడు ఎదురైంది నాకు అసలైన ఆశ్చర్యం ఒక పెద్ద నాట్యస్థలం. సర్కాస్ లో చూసినట్టు గా చుట్టూతా పెద్ద గేలరీ. అక్కడ జనాలు కూర్చుని మధ్యలో జరిగే కార్యక్రమాలను చూసేటట్టు ఉన్నాయి ఆ ఏర్పాట్లు! అడుగులోపల పెట్టేలోపు జయవిజయులలాగా ఇద్దరు నాకు అడ్డుపడ్డారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి ప్రవేశ రుసుము 200 రూపాయలనీ, ఏదో అనాధ పిల్లలకు విరాళం ఇస్తున్నామనీ ఏవో చెప్పారు. ఏమీ మాట్లాడకుండా జేబు లోంచి రెండు వందలు ఇచ్చేసి టికెట్ తీస్కుని లోపలకు వచ్చి కూర్చున్నాను.
కాసేపటికి కార్యక్రమం మొదలైంది. నన్ను నేనే మరిచిపోయేంత ఆకారం, పుత్తడిలో ముంచి తీసినట్టుగా ఎదురుగా నిలబడి ఉంది నిజంగానే పుత్తడిబొమ్మ అనతగ్గ అందం తనది. చందనంవంటి మేనిఛాయ, తారకలను అమర్చినట్టు మెరుస్తున్న కనులు, విల్లు లాగ మెలికెలు తిరిగిన వంగిన ఆ శరీరం.. చూడగానే సౌందర్యకాంతలందర్నీ తలదన్నే ఆ రూపం తేనెలూరే పెదవుల్లో సిరులు పొంగినట్టు వలికిన ఆ చిరునవ్వు, చురకత్తులతో గుచ్చుతున్నట్టు ఆ తీక్ష్ణమైన చూపులు నా గుండెల్లో నాటుకుపోయాయి. చెంబు మీద నుంచుని అరచేతిలో దీపాన్ని మోస్తూ ఎడమ కాలిని చెవికి తగిలించిన ఆ భంగిమ నా షడ్చాక్రాలను జాగృతం చేసాయి. డాన్సు అయ్యాక తనని కలుద్దామని aఅనుకున్నాను కాని ఆ జనాల మధ్య తన అవస్థను గమనించి అదృష్టం లేదనుకుని ఇంటికి మళ్ళాను.
భౌతికంగా తనకు నేను దూరంగా వెళుతున్నా, తన చూపులు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.ఆలా భారంగా గడచినా కొన్ని నెలల తరువాత.... ఒక రోజున నా ఆఫీసు మిత్రుడి పెళ్లికి సంగీథ్ ఏర్పాటు చేసాడు. దానికి వెళితే నాతో కాలు కలపలేక మా ఆఫీసు లోని అమ్మాయిలంతా వల్లకాదని చేతులు ఎత్తేసారు. అప్పుడు చుక్కల మధ్య నుండి ఊడిపడ్డ చందమామ లా తను మళ్ళీ ప్రత్యక్షమైంది. అలా ఇద్దరి కాళ్ళు కళ్ళు జత కలిసి రెండు గంటల దాక నాట్యం సాగేలా చేసాయి. అలా మొదలయిన పరిచయం, పరిచయాలు అన్నీ ముగిసి, అర్ధరాత్రి కావడం తో ఎక్కడా ఆటోలు బస్సులు లేకపోవడంతో సుదూర పయనానికి దారి తీసింది. అడవిలోని అందాన్ని అంతా తనలోనే నింపుకున్న ఆ సుందరి పేరు 'వన్యక' అని తెలిసింది. ఆ పరిచయం నానాటికీ మా ఇద్దరి మధ్య ఏదో బంధం ఏర్పడే లాగా చేసింది.
ఒక శీతాకాలం సాయంత్రం, ఇద్దరం కలిసి బెంగుళూరు అంతా తిరిగి తన ఇంటికి వెళ్లాం ఆ రోజే నాకు తెలిసింది, తను కూడా నాలాగే ఒక అనాధ అని, కొన్ని నెలల క్రితమే ఏదో ప్రమాదంలో వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ చనిపోయారని. వాళ్ళని గుర్తుచేసుకుని తన ఒంటరి జీవితాన్ని తలచుకొని కన్నీరు కార్చబోతున్న సమయంలో నేను తన చెయ్యి పట్టుకుని తనని ప్రేమిస్తున్న విషయం చెప్పాను. జీవితాంతం వరకూ తనతోనే ఉంటానని చెప్పిన ఆ క్షణం, తను ఆనందం తో చూసిన ఆ చూపు నేను ఎప్పటికీ మరువలేనివి. ఆ నిసిరాతిరిలో వెన్నెల లాగా తను నాలో కలిసిపోయింది. అలా జీవితం ఆనందం గా గడుస్తున్న రోజులవి. ప్రపంచం అంతా రంగులమయంగా మారిన క్షణం అది. ప్రతీరోజు ఒక సుమధుర స్వరంలా సాగుతోంది ప్రతీపదంలో నాట్యమే పలుకుతోంది.
ఒకరోజున తను బయటకు వెళ్ళిన సమయంలో ఊసుపోక ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాల అలమారలో నుండి ఒక పుస్తకం తీయబొతే దాని మధ్యలో నుండి ఒక మందుల చీటీ బయటపడింది. అది చూసిన నాకు ఒక్కసారిగా నాకు మతిపోయింది. అది కాన్సెర్ పేషెంట్ కు రాసే మందులు. వన్యక కాన్సెర్ పేషెంట్ అని ఆ నిమిషం నాకు తెలిసింది. ఒక్కసారిగా నన్నెవరో అగాధం లోకి తోసేసినట్టు, ప్రపంచంలోని సముద్రాలన్నీ నాలోనే ఎగిసినట్టు... తనను నా నుండి ఎవరో దూరం చేసేస్తున్నట్టు ఏవేవో పీడకలలునన్ను పగటి పూటే పీడిoచాయి. నా గతం తాలూకు చీకటిపొరలు మళ్ళీ నన్ను చుట్టుముట్టినట్టు అనిపించింది.
బయటనుండి వచ్చిన వన్యక కు ఈ విషయం తెలియదు కాబట్టి మామూలుగానే ప్రవర్తిమ్చిమ్ది. బెడ్రూం లోకి రాగానే విషయం అర్ధమయ్యి నాలోని ఆవేదన ను గమనించి తను కలవర పడింది. ఎంతోసేపు జరిగిన మా సంభాషణ తరువాత తన నిర్ణయం తేల్చి చెప్పేసింది ..
"చూడు ! నా గతాన్ని మరచిపోవాలని ఈ ఒంటరి జీవితంతో విసిగిపోయి నీతో జీవనం సాగిస్తున్నాను కాని మళ్ళీ నా గతం మనమధ్య ఒక గోడ లాగ నిలిచింది కాబట్టి మనం విడిపోవడమే ఈ సమస్య తీరదు. అందుకే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడమే సమంజసం అని నాకు అనిపిస్తోంది".
తన నిర్ణయo విని నా మాట పడిపోయింది. మరి నీ సంగతి ఏంటి అని తనని అడగ గానే, "ఆరిపోయే దీపం ఎప్పటికైనా ఆరక తప్పదు. నన్ను మరిచిపోయి ప్రశాంతం గా నీ ప్రయాణం సాగించు. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావని తలుస్తాను " అని చెప్పింది.
అలా వెళ్ళిపోతున్న తనను చెయ్యి పట్టుకుని నా వైపుకు లాగి అక్కున చేర్చుకుని ఓదార్చాను. అలాగే ఇద్దరం నిద్రలోకి జారుకున్నాం. మరుసటిరోజు ఉదయం లేచిచూస్తే తను ఫ్లాట్లో లేదు... అపార్ట్మెంట్ అంతా వెతికాను , ఎక్కడా లేదు ఓపిక సన్నగిల్లి, మంచం మీద కుదేలయ్యి మా ఫోటో వంక చూస్తే అక్కడ మా ఇద్దరి ఫొటోకు బదులుగా ఒక ఉత్తరం రాసుంది.
"మండుతున్న ఎడారి లాంటి ఈ ఒంటరి జీవితంలో..ఎండమావిలా వచ్చి
నిస్సారమైన ఈ మనసులో స్వరవాహినిని ప్రవహింప చేసావు .....
నీ రూపం...నీ రాగం... నీ గ్న్యాపకాలు ఈ ఊపిరి ఉన్నంతవరకూ నాలో పదిలం!
నీ చిరునవ్వుని కలకాలం ఆకాంక్షిస్తూ... నీ దు:ఖాన్ని మోసుకు వెళ్తున్న ఈ చిరుజీవి "
ఇట్లు ,
నీ
వన్యక!
అని రాసుంది కాని తనకు తెలీదు తనులేని నేను ఎప్పుడూ అసంపూర్ణమే అని నన్ను వదిలి తన గమ్యాన్ని చేరుకోడానికి వెళ్ళిన ఆ వన్యక నా జీవితంలో 'కావ్యకన్యక' గా మారి .....నా అణువణువూ నిండిపోయింది!