మత్తు సోకిన నిసిమి మసకేసి నింగికి
కరిమబ్బు పట్టేను.. చిరుజల్లు కురిసేను..
చినుకు చినుకే మినుకుమని వరదలై పొంగేను
జర జరా పారుతూ సంద్రానికేగేను!!
పుడమి పైన పుట్టి...నింగికెగసిన నరుడు
అన్నింట గెలిచేను.. నేలనే మరిచేను
ప్రకృతి మాత ఒడితో జూదమ్ము ఆడేను
సిరులు ఎన్నో కూడి.. మూలమ్ము మరిచెను
కష్టానికి తట్టుకొని.. కన్నీళ్ళు దిగమింగి
ఓరకంట ఉరమగా..తల్లడిల్లిపోయెను..
ఏవిరా నీ సిరులు.. ఏదిరా నీ భూమి...
ఎచటరా నీ ధనము.. ఎవరురా నీవిపుడు?
జాబు వచ్చునంత వరకు ఏ జాము వీడను..
తల్లి గుండె కోత తెలుసుకో కొడుకా..
ఎప్పటికైనా నా ఒడే నీ పడక!!
కరిమబ్బు పట్టేను.. చిరుజల్లు కురిసేను..
చినుకు చినుకే మినుకుమని వరదలై పొంగేను
జర జరా పారుతూ సంద్రానికేగేను!!
పుడమి పైన పుట్టి...నింగికెగసిన నరుడు
అన్నింట గెలిచేను.. నేలనే మరిచేను
ప్రకృతి మాత ఒడితో జూదమ్ము ఆడేను
సిరులు ఎన్నో కూడి.. మూలమ్ము మరిచెను
కష్టానికి తట్టుకొని.. కన్నీళ్ళు దిగమింగి
ఓరకంట ఉరమగా..తల్లడిల్లిపోయెను..
ఏవిరా నీ సిరులు.. ఏదిరా నీ భూమి...
ఎచటరా నీ ధనము.. ఎవరురా నీవిపుడు?
జాబు వచ్చునంత వరకు ఏ జాము వీడను..
తల్లి గుండె కోత తెలుసుకో కొడుకా..
ఎప్పటికైనా నా ఒడే నీ పడక!!