Tuesday, November 6, 2012

నా స్నేహం..!

ఉవ్వెత్తున ఎగిసిన కెరటం కోరిందే నా స్నేహం...
భూమిని తాకిన తొలికిరణం  కోరిందే నా స్నేహం...
పుడమిని తాకే తొలి బిందువు కోరినదే నా స్నేహం...
మేనుతాకు శీతల పవనం కోరినదే నా స్నేహం ...!!!

ప్రకృతి ఒడిలో హాయిగ ఉంటే ....
స్వేదమైనా అమృతం .....!!!
పక్కన వినపడు శ్రవణములయినా..
నా చెవులకు కోమలం ...!!!!
దూరమయ్యానని బాధపడకు ఓ నేస్తం...
నీవల్లనే కలిసే నాకీ అనుబంధం...!!!
ఈ మధురానుభూతిలో నీ జ్ఞాపాకాలు ఎప్పటికీ 
నా మదిలోన పదిలం ... !!!!