Saturday, March 26, 2011

వీరుడు

ఉరికే ఈ కాలం లో ఉనికి లేని వాడను.. ఊరేది అని అడిగితే ఏమని బదులివ్వను...
ఎగసే  అలలపైనున్న  బిందువంటి బతుకు లో.. నేనెవరని అడిగితే ఏమని బదులివ్వను..
ప్రేమించే మిత్రులకి మనసు లో స్థానం తప్ప ఏమి ఇవ్వలేని ఈ నిర్భాగ్యుడికి ....
                                                               విశాల జగతి లో స్థానం ఎక్కడని  ప్రశ్నిస్తే ఏమని బదులివ్వను....
ఒంటరి పయనం లో నీ గమ్యమేదని నను నిలదీస్తే ఏమని బదులివ్వను....
తుఫాను గాలికి ఎగిరిపోయే ఈ కట్టెకు దిక్కేదని  అని అడిగితే ఏమని బదులివ్వను... 
ఇన్ని  ప్రశ్నలు నన్ను వెంటాడుతున్నా.. నిర్మల  హృదయం తో... దృఢ నిశ్చయం  తో...
పోరాడే తెగువ తో... ప్రేమే నా దైవంగా...సమానత్వమనే భావం తో... 
వెనకంజ వేయని  నా సోదరుల  గుండెలో... మ్రోగే రణభేరిని...పూరించు శంఖారావన్నై ...
ఓటమినేరగని వీరున్నై ఎన్నడు కొలువుంటాను...
మీ శ్వాసలో...ఆశ లో ...ధ్యాస లో...
పదిలంగా  చెక్కు చెదరని హృదయమనే కోటలో సుఖ వాసున్నై....
ఎన్ని యుగాలైనా మీ ఆలోచనలలో జీవిస్తూనే ఉంటాను...

(నా ప్రియతమ వీరుడు భగత్ సింగ్ ను ప్రేరణ గా తీసుకుని మలచిన కవిత )